మంగళవారం, ఏప్రిల్ 14, 2020

స్వాతంత్రోద్యమంలో సంఘ్ పరివార్ (RSS) పాత్ర ఏమీలేదా?




(హాయ్ అండి, ఇది నా యూట్యూబ్ చానెల్(sailorbook), అందరికీ పనికివచ్చే విషయాలమీద వీడీయోస్ చేస్తున్నాను.
ఈ చానెల్ నేను భారతీయ మేధావుల గొప్పదనం, ఇంకా  హిస్టరీ గురించి నాకు తెలిసినవిషయాలు చెప్పడానికి ప్రారంభించాను.
మీరందరూ నాచానెల్ కి సబ్స్క్రైబ్ చేసి, వీడీయో చూసి, మీ ఫీడ్-బాక్ నాకు తెలియజెయ్యండి. ఎప్పటికప్పుడు లోపాలను సవరించుకుంటూ మరిన్న్ని మంచి వీడీయోలు చేస్తాను.
మీ అందరూ సహకరిస్తే, పూర్తిగా డెడికేటెడ్ గా ఇటువంటి వీడీయోలు మరిన్ని చేయ్యాలనుకుంటున్నాను.  మీ ప్రోత్సాహం నాకు మరింత ఉత్సాహాన్నిస్తుంది).


స్వాతంత్ర పోరాటంలో ఆర్.ఎస్.ఎస్ పాత్ర ఏమీలేదా? నిజానికి ఇది ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న.  దేశభక్తులతో నిండిన ఒక సంస్థ,మనసా,వాచా దేశాన్ని తల్లిగా చూసే సేవకులున్న  ఒక NGO, ఆ దేశస్వాత్రంత్రంకోసం జరుగుతున్న అత్యున్నతస్థాయిపోరాటంలో పాల్గొనకుండా ఉందా?
ఇది ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయం. ఎందుకంటే సోషల్ మీడీయా యుగంలో ఉన్నమనకి నిజమేదో, అబద్దమేదో అలోచించి, పరిశోధించి తెలుసుకునే శక్తి రోజురోజుకీ తగ్గిపోతోంది.
ఇది నిజంగా బాధపడవలసిన విషయం. ఎందుకంటే, అలోచించలేని మనుషులు ఉన్న చోట, నకిలీ వార్తలు పేట్రేగిపోతాయి. అలా ఈ విషయం కూడా కొంతమంది నకిలీగాళ్ళకి తమ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెయ్యడానికి ఉపయోగపడుతోంది. ఎవరో ఒక వ్యక్తి యూట్యూబ్ లొ ఒక వీడీయోనో, సోషల్-మీడీయాలో ఒక పోస్టో పెడతారు. ముందు వెనక చూసికోకుండా దానిని చూసినవారందరూ షేర్ చేసేస్తారు.  దానివల్ల తప్పుడుసమాచారం ప్రజలందరికీ చేరిపోతోంది.
అలా సోషల్ మీడీయాలో విసృతంగా ఉన్న ఒక తప్పుడు ప్రచారం, స్వాతంత్ర పోరాటంలో ఆర్.ఎస్.ఎస్ పాత్ర ఎమీలేదని. ఇప్పుడుమనం అందులో ఉన్న సమాచారంతో నిజానిజాలు తెలుసుకుంటే, స్వాతంత్రపోరాటంలో ఆర్.ఎస్.ఎస్ ఎటువంటి పాత్రపోషించిందో మనకి అర్ధమౌతుంది

1921 వ సంవత్సరం  కేరళలోని మలబార్ తీరంలో మోప్లారైతుల తిరుగుబాటు జరిగింది. దానికి కాంగ్రేస్ మద్దతు ఇచ్చింది.  ఆ రైతుల ఉద్యంలోకి కొందరు మతోన్మాదులు చేరి ఉద్యమాన్ని హింసాత్మకం చేసేశారు. దానిలో ఎందరో హిందువులు దారుణమైన ఊచకోతకు గురయ్యారు.
ఆ ఉద్యమం పరిధులు దాటి హింసాత్మక రూపం దాల్చడంతో కాంగ్రేస్ దానినుండీ బయటకి వచ్చేసింది. ఇంతజరిగినా, హిందువులను ఊచకోత కోసిన మతోన్మాదులపై ఏవిధమైన చర్యలు తీసుకోలేదు.
ఈ విషయాలన్నీ మనసులో ఉండడంతో డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ గారు  హిందువులకి రక్షణగా ఉండడంకోసం 1925  లో  RSSను స్థాపించారు. అప్పటికే హెడ్గేవర్ గారు స్వాతంత్రపోరాటంలో చురుకుగా పాల్గొంటున్నారు. తనే ఒక సంస్థను స్థాపించినా,  పోరాటంలో ఆయన చాలాకాలం కాంగ్రేస్తో కలిసే నడిచారు.
డా.హెడ్గేవార్ స్వయంగా కాంగ్రెస్ కార్యకర్త. లోకమాన్య తిలక్ వంటి గొప్ప నాయకులతో కలిసి చాలాకాలం పనిచేశారు. విప్లవ కార్యకలాపాలలో పాల్గొని 1921లో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించారు కూడా. ఆ సందర్భంగా సాగిన కోర్టు విచారణలో భారత స్వాతంత్ర్య పోరాటాన్ని గురించి గట్టిగా వాదించడమే కాక తన చర్యలను సమర్ధించుకున్నారు. 

1 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

పెద్దగా ఆశ్చర్యపోవలసిన దేమీ లేదండీ. స్వతంత్రపోరాటాన్ని కాంగ్రెసు ముందుండి నడిపించింది. దాన్ని మెల్లగా కేవలం స్వంతం చేసుకుంది. చివరికి ఇందిరమ్మ ఐతే గాంధీగారినే ప్రక్కన పెడుతూ ఒక కాలనాళికను రూపొందించి అల్లరి పాలయ్యింది. స్వాతంత్ర్యం దేశప్రజల పోరాటం వలన కంటే కాంగ్రెసు వారి గొప్పదనం వలన వచ్చిందన్న అభిప్రాయాన్ని పాఠంగా జనం బుర్రల్లోనికి నరనరాల్లో నాకీ ఎక్కించారీ కాంగీయులు. ఆక్రమంలో కాంగ్రెసేతర సంస్థలను చులకన చేయటమే కాదు వెలివేశారు. గాంధీగారి హత్య ఆరె‌స్సెస్ సంస్థ పని అని నిందను ప్రచారం చేసి ఆ సంస్థను దోషిని చేసి అది ఋజువు కాకపోయినా అదేపాట పాడుతూనే ఉన్నారు. కాంగ్రెసువారు కాని వారిని అగౌరవం మామూలే అల్లూరి సీతారామరాజుని కూడా ఈ కాంగ్రెస్ ఎన్నడూ తగినంతగా గౌరవించలేదు. నిజానికి నెహ్రూ & కో. మాత్రమే స్వతంత్ర వీలులేని ఎల్లకాలం వెలగటం కుదరలేదు - ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక చచ్చిన చెట్టు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి