శనివారం, ఆగస్టు 17, 2013

యువవారధి

ఇతరులకు సాయంచెయ్యాలి అనేమనసు మనలో చాలామందికి ఉంటుంది.కానీ కొంతమంది మాత్రమే దానిని ఆచరణలో చూపగలరు. సాయం అనేది డబ్బురూపంలోనే ఉండవలసిన అవసరం లేదు, నిరాశలోఉన్నవాడికి ఇవ్వగలిగే ఒకచిన్న మోరల్ సపోర్ట్ ,ఇన్ ఫీరియారిటి కాంప్లెక్స్ తో ముడుచుకుపొయే వాడికి ఇచ్చేకౌన్సెలింగ్,డిగ్రీ చేతిలోఉన్నా దానికి తగిన ఉద్యోగం సంపాదించుకొలేనివారికి చేయగలిగే గైడెన్స్  ఏదైనా సాయమే. దానికి పెద్దపెద్ద పెట్టుబడులు పెట్టవలసిన అవసరంలేదు. చేయిచేయి కలిపి ముందుకునడిపే తోడుఉంటే చాలు.

                 సరిగ్గాఅదేభావనతో ఏర్పడ్డసంస్థే యువవారధి

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ ఎంతోమంది యువతియువకులకు అనేకవిధాలుగా సాయపడుతోంది ఈసంస్థ. దాదాపు 1.4 మిలియన్ల NGOలు ప్రత్యక్ష్యంగాను పరోక్షంగాను ఈసేవలో భాగం పంచుకుంటున్నారు, ఇంకా  అనేకమంది యువతియువకులు  ఈసంస్థలో స్వచ్చందంగా పనిచేస్తున్నారు. హెల్ప్ అనేమాటకి ప్రత్యేకమైన డెఫినిషనేమీ ఉండదక్కడ. ఫలానాపనిని ఫలానాచోటే చెయ్యలనే నిబందనకుడా ఎమీఉండదు. మనం నేర్చుకున్న లేక అబ్సర్వ్ చేసిన పనిని నచ్చిన చోట ఇంప్లిమెంట్ చెయ్యచ్చు. దానికి ఎవరి పర్మిషన్ కూడాఅవసరం లేదు(మరొకరికి ఇబ్బంది రానంతవరకు).

 ఈ స్వచ్చందసేవలొ భాగంపంచుకునేవారందరికి ఎవరి ఉద్యోగాలు వాళ్ళకి ఉంటాయి.వారాంతాల్లోనో లేక ముందుగా అనుకున్న సమయానికో వాలంటీర్స్ అందరూ ఒకచోట కలుసుకుని చేయాలనుకుంటున్నపని విధి విధానాలను,జరుగుతున్నపనుల ప్రోగ్రసుని చర్చించుకుంటూ ముందుకుసాగిపోతారు.వీధిబాలలను శరణాలయాల్లో జాయిన్ చెయ్యడం, పల్లెలలో గ్రంధాలయాలను ఏర్పాటుచెయ్యడం, యువతకు కెరియర్ ఓరిఎంటెడ్ వర్క్-షాప్ లను కండక్ట్ చెయ్యడం,వాతావరణ కాలుష్యం, వాతావరణ పరిరక్షణ గురించి అవేర్నెస్ పెంపొందించడం ఇంకా ఎలక్టానిక్ వ్యర్ధాల రీ-సైక్లింగ్ వంటివి వీరి పోర్టిఫోలియోలో భాగంగా ఉంటాయి.అనేకమంది ఒకపక్క చదువుకుంటూకూడా ఇందులొ భాగస్వామ్యులవుతున్నారు.ఇటువంటి వాటిల్లో భాగస్వామ్యులవడం ద్వారా అప్పుడే చదువు ముగించుకుని ఉద్యోగ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న యువతియువకులకి లీడర్ షిప్ క్వాలిటీస్ కూడా పెరుగుతాయి. తమ ఉద్యోగ జీవితంలో టార్గెట్ల వెంట డేడ్ లైన్ల వెంట పరుగిడుతూనే సమాజసేవకి కుడా సమయం కేటాయిస్తున్న యువవారధి వాలంటీర్లందరికి ఈ బ్లాగుతరపున అభినందనలు.

Note :ఇందులొ భాగంపంచుకోవాలి అనే ఉత్సాహం ఉన్నవాళ్ళు వారి వెబ్-సైటు (www.yuvavaradhi.com) ద్వారా అవసరమైన సమాచారం పొందవచ్చు.  


ఆదివారం, ఆగస్టు 11, 2013

క్లౌడ్ కంప్యూటింగ్-2

                                 "పాలు తాగాలంటే ఆవుని కొనవలసిన అవసరంలేదు "

ఆవు కొనవలసిన అవసరం లేకుండానే ,అది ఉన్న వ్యక్తి వద్దకి మనం వెళ్ళి పాలు కొనుక్కొవచ్చు.క్లౌడ్ కంప్యూటింగ్ కి సరిపొయే మాటయిది. ఈ సూత్రం ప్రకారమే క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థ పని చేస్తుంది...

ఇందులో 3 రకములున్నాయి.

1.సాఫ్ట్‌వేర్ సర్వీసు (సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్విస్)

     మనకి కావలసిన సాఫ్ట్ వేర్ కొనవలసిన అవసరం లెకుండా, క్లౌడ్ సర్వీసు అందించే సంస్థ కి కొంత సర్వీసు చార్జ్ పే చేసి మనం ఆ  సాఫ్ట్ వేర్ ని వాడుకొవచ్చు. ఇది ఆసంస్ఠ కి మనకి కుడా ప్రయోజన కరమైనది.లైటు వేసినంతసెపే మీటరు తిరుగుతుంది, తిరిగిన మీటరుకే మనం బిల్లు పే చెయ్యవలసిన అవసరం ఉంటుంది. అదే విధంగా వర్కింగ్ అవర్స్ కే మనం గంటకి ఇంతా అని బిల్లు పే చెస్తే సరిపొతుంది.

2.హార్డ్‌వేర్  సర్వీసు (హార్డ్‌వేర్ యాజ్ ఎ సర్విస్)

    మనదగ్గరున్న సర్వర్ ల కంటె మంచి సర్వర్ అవసరం మనకి పడినప్పుడు మనదగ్గరున్న పాత సర్వర్లని పక్కనపెట్టవలసిన అవసరం రావచ్చు. ఆ విధంగా మనకి కొంచెం నస్టం  కలిగే అవకాశం  ఉంది.  క్లౌడ్ సర్వీసు ఉపయోగించినట్లైతే ఎప్పుడైనా మనసర్వర్ పెర్ఫార్మెన్సుని అప్-గ్రెడ్ చెసుకొవలసి వచినప్పుడు, పాత సర్వర్ స్థానంలో కొత్తసర్వర్ ని మనం కోరవచ్చు. ఏప్పుడైనా సర్వర్ ఐడియల్ గా ఉంచిన సమయంలొ బిల్లు చెల్లించవలసిన అవసరం ఉండదు.

3.డేటాబేస్ సర్వీసు (డేటాబేస్ యాజ్ ఎ సర్విస్)

   కొంతమంది సర్విస్ ప్రొవైడర్లు డేటాబేస్ సర్విసుని కూడా అందిస్తారు.ఇక్కడ డేటాబేస్ ని మనం ఇనిస్టాల్/మైంటైన్ చెయ్యవలసిన అవసరం ఉండదు.సర్విస్ ప్రొవైడరే ఆ బాధ్యత తీసుకుంటాడు.వాడిన దానికి మాత్రమే రెంట్ కడితే చాలు…

ఒక కంప్యూటరు,ఇంటెర్నెట్ సౌకర్యం ఉంటే ఏసాఫ్ట్‌వేర్ కొనవలసిన అవసరం లేకుండానే క్లౌడ్ కంప్యూటింగ్  ద్వారా మనపనులని చక్కపెట్టుకోవచ్చు.


ఇన్ని లాభాలు కనిపిస్తున్న చోటే కొన్ని నష్టభయాలు కూడా ఉన్నాయి  :


  మన మెయిల్ ఐడిలకే రక్షణ లేదని మొన్న అమెరికాలో జరిగిన స్నొడెన్ ఉదంతం మనకి నిరూపిస్తోంది. ఇక ఎంతో కష్టపడి డెవలప్ చేసుకున్నమన  సాఫ్ట్‌వేర్‌లకి రక్షణ ఎంత అన్నది అనుమానించాల్సిన విషయమే.


శనివారం, ఆగస్టు 10, 2013

క్లౌడ్ కంప్యూటింగ్-1

సాధారణంగా సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేసేవాళ్ళకి, ఇంటర్నెట్-కంప్యూటర్ వాడేవారు రోజు క్లౌడ్ కంప్యూటింగ్ లేదా క్లౌడ్ అనే పదాన్ని వింటూనే ఉంటారు.  వారిలొ చాలామందికి క్లౌడ్  గురించి అవగాహన బాగానే ఉంటుంది. ఐతే కొత్తగా సాఫ్ట్ వేర్ రంగంలోకి అడుగుపెట్టే వారికి  క్లౌడ్ కంప్యూటింగ్ మీద అవగాహన తక్కువగా ఉంటుంది .వారి అవగాహన కొసమే ఈ చిన్ని ప్రయత్నం.

"క్లౌడ్‌ కంప్యూటింగ్‌'తో డేటా మొత్తాన్ని ఆన్‌లైన్‌లోనే సేవ్ చేసుకుని ఎక్కడైనా వాడుకోవచ్చు. "

మనం సాధారణంగా మన ఫైల్స్, ఫొటొలు గాని  మన కంప్యూటర్లోనో, లేదా ఏ పెన్‍డ్రైవులోనో సేవ్ చేసుకోవడం మనకలవాటు.   కాని అవి ఎప్పుడు పడితే అప్పుడు మనకు అందుబాటులొ ఉండాలంటే కొంచెం కష్టం.అయితే టెక్నాలజి మెరుగవుతున్నకొద్దీ గూగుల్ డ్రైవ్ లాంటి సెర్వీసులు అందుబాటులోకి వచ్చాక చాలా వరకూ కంప్యూటర్ లో సేవ్  చేయబడే ఫైల్స్, ఫొటొలు నుండీ వీడియోల వరకూ ఈ సేవల ద్వారా ఇంటర్నెట్లో సేవ్ చేయబడి  ఆపై షేర్ చెసుకొవడం , మరో చోటు నుండీ వీటిని పొందటం చాలా సులభం అయిపోయింది. ఎక్కడైనా నెట్ సెంటర్ నుంచి కూడా వీటిని యాక్సెస్ చేసుకునే అవకాశం మనకి వచ్చింది.ఆఖరికి స్మార్ట్ ఫోన్ ల సహాయం తొ కూడా ఈ స్టోర్డ్ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు   .

ఇప్పుడీ క్లౌడ్ అంటే ఏమిటో చూద్దాం.

కంప్యూటరులో సేవ్ చేసిన ఫైల్స్ ఏ విదంగా ఐనా పాడయ్యె అవకాశం ఉంది.. వైరస్ ఎటాక్ అవ్వవచ్చు లేక హార్ద్-డిస్కే క్రాష్ అవ్వవచ్చు, పొరపాటున డిలీట్ అయిపోవచ్చు. అందువలన ఇంటర్ నెట్ బేస్డ్  సేవింగ్ సెర్వీసెస్ ని వాడడం ద్వారా ఈ ప్రమాదం నుంచి సేవ్ కావచ్చు.. దీనినే ఇంటర్నెట్ బేస్డ్ క్లౌడ్ స్టోరేజ్ అంటాం.

క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి?

మనకి తెలియకుండానే మనం క్లౌడ్ కంప్యూటింగ్ వాడుతున్నాం.సోషల్ నెట్-వర్కింగ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాక ఫేస్‍బుక్ లేదా గూగుల్+ లాంటి సైట్ లలో ఫొటోలు అప్-లోడ్ చెయ్యడం/డౌన్-లోడ్  చెయ్యడం మనకి సాధారణం ఐపొయింది .   ఈ ఫైల్స్ ఇంటర్నెట్ కి కనెక్ట్  ఉన్న ఏ కంప్యూటరు లేదా స్మార్ట్‍ఫోన్ ద్వారానో మీరు పొందవచ్చు. ఎందుకంటే ఈ ఫైల్స్  రియల్ గా డేటా సెంటర్ అనబడే ఒక కంప్యూటర్ వేర్ హౌస్ లో సేవ్  చెయ్యబడి ఉంటాయి.ఇలా ఒక ఫైల్  ప్రపంచంలో అనేక డేటా సెంటర్లలో సేవ్  చేసి ఉంటుంది. ఒకటి పాడయిపోతే మరోటి అందుబాటులో ఉంటుంది.
*క్లౌడ్‌ కంప్యూటింగ్‌  గురించి మరిన్ని వివరాలు తరువాతి పోస్ట్ లో డిస్కస్ చేద్దాం ...

శుక్రవారం, ఆగస్టు 09, 2013

కామెంట్స్ పాలసీ


  • తెలుగు భాషని ఉద్దరించడం ఈబ్లాగ్‌ ఉద్దేశ్యం ఎంతమాత్రం కాదు.నాకు అంత సీన్ కుడా లేదు ..ఇక్కడ మీకు దొరికేవి సాంకేతిక అంశాలమీద కబుర్లు మరియు కొన్ని కాలక్షేపం బఠానీలు మాత్రమే... గమనించగలరు... :) 

  • నిజ జీవితంలో పరిచయం లేని వ్యక్తి తారసపడినపుడు ఆ వ్యక్తి పట్ల ఎలా ప్రవర్తిస్తామో అదే విధంగా పరిచయం లేని సాటి బ్లాగర్‌తో వ్యవరించాలన్న కనీస అవగాహన బ్లాగర్లకు, వ్యాఖ్యాతలకు ఉంటుందని భావిస్తున్నాం. అటువంటివారి వ్యాఖ్యానాలనే అనుమతించగలమని సవినయంగా తెలియజేస్తున్నాం.

  • ఆధిక్యత, వెటకారం, హేళన, దూషణలతో నిండిన కామెంట్లు తొలగిస్తాము. ఈ కారణాలతో తొలగించబడిన కామెంట్లు రాసినవారు మరొకసారి కామెంట్ రాయడానికి –అది ఎలా ఉన్నప్పటికీ– అనుమతించడం సాధ్యం కాదని విన్నవించుకుంటున్నాం.

  • వ్యాఖ్యానాల్లో సభ్యత సంస్కారాలు తప్పని సరిగా ఉండేలా చూసుకోవాలని కోరుతున్నాం. చేరువగా లేమన్న ధైర్యంతో ఇస్టమొచ్చినట్లు వ్యాఖ్యానించవచ్చని భావించడం అనాగరికత అని గౌరవనీయ సందర్శకులు గమనించగలరు.

  • మరొకరి పేరుతో వ్యాఖ్యానించడం వారి ఐడెంటిటీని దొంగిలించినట్లే. అది హీన సంస్కృతి,పూర్తిగా అభ్యంతరకరం. అటువంటివారి కామెంట్లను అనుమతించలేము. అటువంటి వారి కామెంట్లు పొరబాటున ఆమోదం పొందితే మాకు తెలియ జేయండి. తొలగిస్తాము. అయితే అలాంటి వ్యాఖ్యానాలకు బ్లాగ్ రచయితల భాద్యత లేదని గుర్తించ గలరు.

  • తెలుగులో ఉన్న ఏ బ్లాగ్‌లో నైనా దూషణలతో, హేళనలతో కామెంటు పెట్టినవారు ఈ బ్లాగ్‌లో కామెంట్ పెట్టడానికి అనర్హులు. ఏ బ్లాగర్‌తోనైనా అమర్యాదగా ప్రవర్తించినవారు ఎవరైనా ఇక్కడ కామెంట్ పెట్టినట్లయితే తెలియజేయండి. నిర్ధారించుకుని తొలగిస్తాము.

  • ఈ కామెంట్స్ పాలసీలో ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా మార్పు చేర్పులు చేయడానికి ఈ బ్లాగర్లకు హక్కు ఉంది.