శనివారం, ఆగస్టు 17, 2013

యువవారధి

ఇతరులకు సాయంచెయ్యాలి అనేమనసు మనలో చాలామందికి ఉంటుంది.కానీ కొంతమంది మాత్రమే దానిని ఆచరణలో చూపగలరు. సాయం అనేది డబ్బురూపంలోనే ఉండవలసిన అవసరం లేదు, నిరాశలోఉన్నవాడికి ఇవ్వగలిగే ఒకచిన్న మోరల్ సపోర్ట్ ,ఇన్ ఫీరియారిటి కాంప్లెక్స్ తో ముడుచుకుపొయే వాడికి ఇచ్చేకౌన్సెలింగ్,డిగ్రీ చేతిలోఉన్నా దానికి తగిన ఉద్యోగం సంపాదించుకొలేనివారికి చేయగలిగే గైడెన్స్  ఏదైనా సాయమే. దానికి పెద్దపెద్ద పెట్టుబడులు పెట్టవలసిన అవసరంలేదు. చేయిచేయి కలిపి ముందుకునడిపే తోడుఉంటే చాలు.

                 సరిగ్గాఅదేభావనతో ఏర్పడ్డసంస్థే యువవారధి

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ ఎంతోమంది యువతియువకులకు అనేకవిధాలుగా సాయపడుతోంది ఈసంస్థ. దాదాపు 1.4 మిలియన్ల NGOలు ప్రత్యక్ష్యంగాను పరోక్షంగాను ఈసేవలో భాగం పంచుకుంటున్నారు, ఇంకా  అనేకమంది యువతియువకులు  ఈసంస్థలో స్వచ్చందంగా పనిచేస్తున్నారు. హెల్ప్ అనేమాటకి ప్రత్యేకమైన డెఫినిషనేమీ ఉండదక్కడ. ఫలానాపనిని ఫలానాచోటే చెయ్యలనే నిబందనకుడా ఎమీఉండదు. మనం నేర్చుకున్న లేక అబ్సర్వ్ చేసిన పనిని నచ్చిన చోట ఇంప్లిమెంట్ చెయ్యచ్చు. దానికి ఎవరి పర్మిషన్ కూడాఅవసరం లేదు(మరొకరికి ఇబ్బంది రానంతవరకు).

 ఈ స్వచ్చందసేవలొ భాగంపంచుకునేవారందరికి ఎవరి ఉద్యోగాలు వాళ్ళకి ఉంటాయి.వారాంతాల్లోనో లేక ముందుగా అనుకున్న సమయానికో వాలంటీర్స్ అందరూ ఒకచోట కలుసుకుని చేయాలనుకుంటున్నపని విధి విధానాలను,జరుగుతున్నపనుల ప్రోగ్రసుని చర్చించుకుంటూ ముందుకుసాగిపోతారు.వీధిబాలలను శరణాలయాల్లో జాయిన్ చెయ్యడం, పల్లెలలో గ్రంధాలయాలను ఏర్పాటుచెయ్యడం, యువతకు కెరియర్ ఓరిఎంటెడ్ వర్క్-షాప్ లను కండక్ట్ చెయ్యడం,వాతావరణ కాలుష్యం, వాతావరణ పరిరక్షణ గురించి అవేర్నెస్ పెంపొందించడం ఇంకా ఎలక్టానిక్ వ్యర్ధాల రీ-సైక్లింగ్ వంటివి వీరి పోర్టిఫోలియోలో భాగంగా ఉంటాయి.అనేకమంది ఒకపక్క చదువుకుంటూకూడా ఇందులొ భాగస్వామ్యులవుతున్నారు.ఇటువంటి వాటిల్లో భాగస్వామ్యులవడం ద్వారా అప్పుడే చదువు ముగించుకుని ఉద్యోగ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న యువతియువకులకి లీడర్ షిప్ క్వాలిటీస్ కూడా పెరుగుతాయి. తమ ఉద్యోగ జీవితంలో టార్గెట్ల వెంట డేడ్ లైన్ల వెంట పరుగిడుతూనే సమాజసేవకి కుడా సమయం కేటాయిస్తున్న యువవారధి వాలంటీర్లందరికి ఈ బ్లాగుతరపున అభినందనలు.

Note :ఇందులొ భాగంపంచుకోవాలి అనే ఉత్సాహం ఉన్నవాళ్ళు వారి వెబ్-సైటు (www.yuvavaradhi.com) ద్వారా అవసరమైన సమాచారం పొందవచ్చు.  


0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి