ఆదివారం, ఆగస్టు 11, 2013

క్లౌడ్ కంప్యూటింగ్-2

                                 "పాలు తాగాలంటే ఆవుని కొనవలసిన అవసరంలేదు "

ఆవు కొనవలసిన అవసరం లేకుండానే ,అది ఉన్న వ్యక్తి వద్దకి మనం వెళ్ళి పాలు కొనుక్కొవచ్చు.క్లౌడ్ కంప్యూటింగ్ కి సరిపొయే మాటయిది. ఈ సూత్రం ప్రకారమే క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థ పని చేస్తుంది...

ఇందులో 3 రకములున్నాయి.

1.సాఫ్ట్‌వేర్ సర్వీసు (సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్విస్)

     మనకి కావలసిన సాఫ్ట్ వేర్ కొనవలసిన అవసరం లెకుండా, క్లౌడ్ సర్వీసు అందించే సంస్థ కి కొంత సర్వీసు చార్జ్ పే చేసి మనం ఆ  సాఫ్ట్ వేర్ ని వాడుకొవచ్చు. ఇది ఆసంస్ఠ కి మనకి కుడా ప్రయోజన కరమైనది.లైటు వేసినంతసెపే మీటరు తిరుగుతుంది, తిరిగిన మీటరుకే మనం బిల్లు పే చెయ్యవలసిన అవసరం ఉంటుంది. అదే విధంగా వర్కింగ్ అవర్స్ కే మనం గంటకి ఇంతా అని బిల్లు పే చెస్తే సరిపొతుంది.

2.హార్డ్‌వేర్  సర్వీసు (హార్డ్‌వేర్ యాజ్ ఎ సర్విస్)

    మనదగ్గరున్న సర్వర్ ల కంటె మంచి సర్వర్ అవసరం మనకి పడినప్పుడు మనదగ్గరున్న పాత సర్వర్లని పక్కనపెట్టవలసిన అవసరం రావచ్చు. ఆ విధంగా మనకి కొంచెం నస్టం  కలిగే అవకాశం  ఉంది.  క్లౌడ్ సర్వీసు ఉపయోగించినట్లైతే ఎప్పుడైనా మనసర్వర్ పెర్ఫార్మెన్సుని అప్-గ్రెడ్ చెసుకొవలసి వచినప్పుడు, పాత సర్వర్ స్థానంలో కొత్తసర్వర్ ని మనం కోరవచ్చు. ఏప్పుడైనా సర్వర్ ఐడియల్ గా ఉంచిన సమయంలొ బిల్లు చెల్లించవలసిన అవసరం ఉండదు.

3.డేటాబేస్ సర్వీసు (డేటాబేస్ యాజ్ ఎ సర్విస్)

   కొంతమంది సర్విస్ ప్రొవైడర్లు డేటాబేస్ సర్విసుని కూడా అందిస్తారు.ఇక్కడ డేటాబేస్ ని మనం ఇనిస్టాల్/మైంటైన్ చెయ్యవలసిన అవసరం ఉండదు.సర్విస్ ప్రొవైడరే ఆ బాధ్యత తీసుకుంటాడు.వాడిన దానికి మాత్రమే రెంట్ కడితే చాలు…

ఒక కంప్యూటరు,ఇంటెర్నెట్ సౌకర్యం ఉంటే ఏసాఫ్ట్‌వేర్ కొనవలసిన అవసరం లేకుండానే క్లౌడ్ కంప్యూటింగ్  ద్వారా మనపనులని చక్కపెట్టుకోవచ్చు.


ఇన్ని లాభాలు కనిపిస్తున్న చోటే కొన్ని నష్టభయాలు కూడా ఉన్నాయి  :


  మన మెయిల్ ఐడిలకే రక్షణ లేదని మొన్న అమెరికాలో జరిగిన స్నొడెన్ ఉదంతం మనకి నిరూపిస్తోంది. ఇక ఎంతో కష్టపడి డెవలప్ చేసుకున్నమన  సాఫ్ట్‌వేర్‌లకి రక్షణ ఎంత అన్నది అనుమానించాల్సిన విషయమే.