ఆదివారం, ఏప్రిల్ 26, 2020

LockdownL: కరోనా టైంలో కొత్తవిషయాలు నేర్చుకుందాంLockdown: #carona దెబ్బకి నెలరోజుల పైనుండీ ఇంట్లో కూర్చుని బోర్ కొడుతోందా? చ, వెధవ కరోనా దీనివల్ల నా పనంతా పాడైపోతోంది అనిపిస్తోందా? నిజమే, కరోనా దెబ్బకి అందరి పనులూ ఆగిపోయాయి. దేశం అంతా #Lockdown అయిపోయింది. కాలేజీలకి, ఆఫీసులకి వెళ్ళ కూడదు. ప్రభుత్వం చెబుతున్నట్లు, ఇంకో 15 రోజుల్లో అంతా సెట్ ఐపోతుందనే అనుకుందాం. కానీ, ఒకవేళ #Lockdown Extend అయ్యి, ఇంకొన్నిరోజులు ఇలాగే గడపాల్సిన పరిస్థితి వస్తే, మనకి అనుకోకుండా దొరికిన ఈ ఖాళీ సమయాన్ని కొత్త విషయాలు నేర్చుకోడానికి ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం. ముఖ్యంగా ఇప్పుడే చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లోకి వద్దాం అనుకుంటున్న దశలోఉన్న #Students. సో, దొరికిన ఈ టైం ని ఉపయోగించుకుంటూ ఏమేం చెయ్యాచ్చో ఈ వీడీయోలో డిస్కస్ చేద్దాం. ఇంకో విషయం ఇదేదో నా పర్శనల్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకోడానికో, లేదా మార్కేటింగ్ jobs కి మిమ్మల్ని attract చెయ్యడానికో చేస్తున్న వీడీయో అయితే కాదు. జస్ట్ కాజువల్ డిస్కషన్ అంతే.

ఈ వీడీయో కనుక మీకు నచ్చితే, నా చానెల్ కి Subscribe అవ్వండి. దాని వల్ల్ మరిన్ని మంచి వీడీయోలు చెయ్యడనికి నాకు వీలవుతుంది.

Subscribe అవ్వడానికి లింక్ క్రింద ఇచ్చాను

Channel Link
https://www.youtube.com/watch?v=gfh4uyn-sPM

ఆర్యభట్ట చెప్పిన π విలువ - Sailorbook

హాయ్ ఫ్రెండ్స్, మన పూర్వీకులలో π విలువను వివిధ దేశాలకు చెందిన  గణిత శాస్త్రవేత్తలు చాలామందే చెప్పారు. కానీ వారంతా కొన్ని దశాంశాలవరకే చెప్పగలిగారు. కానీ దాని విలువను 31 దశాంశాలవరకూ ఖచ్చితంగా గణించి చెప్పినవాడు మన ప్రాచీనుడైన ఆర్యభట్ట. ఏసాంకేతిక విజ్ఞానమూ అందుబాటులో లేని ఆకాలంలోనే అంటే 4వ శతాబ్ధంలోనే ఆర్యభట్ట 31దశాంశాలవరకూ గణించగలిగాడు. అదేసమయంలో π విలువను కృష్ణుని ప్రార్ధిస్తున్నట్లుగా ఉండే ఒక సంస్కృత శ్లోకరూపంలో వ్య్క్తపరిచాడాం ఆర్యభట్ట ప్రత్యేకత. ఆశ్లోకం దానిలో ఉన్న మార్మిక అర్ధం ఈ క్రింది వీడిలోయో ఇచ్చాను చూడండి, అలాగే నా చానెల్ ఇప్పటివరకూ సబ్స్క్రైబ్ అవ్వనివారు ఎవరెన ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. మీ అందరి ప్రోతాహంతో మరిన్ని మంచి వీడీయోలు చెయ్యడానికి ప్రయత్నిస్తాను.
https://www.youtube.com/watch?v=Y57SsLQTxBw&t=26s

శనివారం, ఏప్రిల్ 25, 2020

మన పక్కనే జరిగినా మనకి తెలియనిజలియన్‌వాలా బాగ్-విదురశ్వత్థ

జలియన్ వాలాబాగ్, భారత స్వతంత్ర పోరాట చరిత్రలో మర్చిపోలేని ఒక చేదు జ్ఞాపకం. పంజాబ్ రాష్ట్రంలో ఉన్న అమృత్సర్ పట్టణంలోని జలియన్ వాలాబాగ్ అనే తోటలో సమావేశమయ్యి, సభ నిర్వహించుకుంటున్న స్వాతంత్ర ఉద్యమకారులని చుట్టుముట్టి, ఏవిధమైన warning లేకుండా జనరల్ డయ్యర్ ఒక్కసారిగా firingచేసి అనేకమంది మరణానికి కారణమయ్యాడు. దాని గురించి మనలో చాలామందికి తెలుసు.
కానీ దక్షిణ భారతదేశంలో మన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా అదే తరహా సంఘటన జరిగిందని, దానికి ఇవాళ్టితో  82 సంవత్సరాలు నిండాయని మనలో చాలా మందికి తెలీదు. అలా మనెవ్వరికీ తెలియకుండ మరుగున పడిపోయిన దక్షిణ భారత జలియన్ వాలాబాగ్ దుర్ఘట్న గురించి ఇవాళ తెలిసుకుందాం. యాదృశ్చికంగా రెండు సంఘటనలూ ఏప్రెల్ నెలలోనే జరిగాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా సరిహద్దు రాష్ట్రం కర్ణాటక లో  ఒకప్పుడు గౌరీబిదనూరు జిల్లాలో  ఉన్న విదురశ్వత్థ అనే గ్రామంలో 1938 ఏప్రిల్ 25న ఈ విషాదం చోటుచేసుకుంది.  విదురశ్వత్థ పెన్నేరు నది ఒడ్డున ఉండే ఒక ప్రశాంతమైన గ్రామం. 

మంగళవారం, ఏప్రిల్ 14, 2020

స్వాతంత్రోద్యమంలో సంఘ్ పరివార్ (RSS) పాత్ర ఏమీలేదా?
(హాయ్ అండి, ఇది నా యూట్యూబ్ చానెల్(sailorbook), అందరికీ పనికివచ్చే విషయాలమీద వీడీయోస్ చేస్తున్నాను.
ఈ చానెల్ నేను భారతీయ మేధావుల గొప్పదనం, ఇంకా  హిస్టరీ గురించి నాకు తెలిసినవిషయాలు చెప్పడానికి ప్రారంభించాను.
మీరందరూ నాచానెల్ కి సబ్స్క్రైబ్ చేసి, వీడీయో చూసి, మీ ఫీడ్-బాక్ నాకు తెలియజెయ్యండి. ఎప్పటికప్పుడు లోపాలను సవరించుకుంటూ మరిన్న్ని మంచి వీడీయోలు చేస్తాను.
మీ అందరూ సహకరిస్తే, పూర్తిగా డెడికేటెడ్ గా ఇటువంటి వీడీయోలు మరిన్ని చేయ్యాలనుకుంటున్నాను.  మీ ప్రోత్సాహం నాకు మరింత ఉత్సాహాన్నిస్తుంది).


స్వాతంత్ర పోరాటంలో ఆర్.ఎస్.ఎస్ పాత్ర ఏమీలేదా? నిజానికి ఇది ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న.  దేశభక్తులతో నిండిన ఒక సంస్థ,మనసా,వాచా దేశాన్ని తల్లిగా చూసే సేవకులున్న  ఒక NGO, ఆ దేశస్వాత్రంత్రంకోసం జరుగుతున్న అత్యున్నతస్థాయిపోరాటంలో పాల్గొనకుండా ఉందా?
ఇది ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయం. ఎందుకంటే సోషల్ మీడీయా యుగంలో ఉన్నమనకి నిజమేదో, అబద్దమేదో అలోచించి, పరిశోధించి తెలుసుకునే శక్తి రోజురోజుకీ తగ్గిపోతోంది.
ఇది నిజంగా బాధపడవలసిన విషయం. ఎందుకంటే, అలోచించలేని మనుషులు ఉన్న చోట, నకిలీ వార్తలు పేట్రేగిపోతాయి. అలా ఈ విషయం కూడా కొంతమంది నకిలీగాళ్ళకి తమ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెయ్యడానికి ఉపయోగపడుతోంది. ఎవరో ఒక వ్యక్తి యూట్యూబ్ లొ ఒక వీడీయోనో, సోషల్-మీడీయాలో ఒక పోస్టో పెడతారు. ముందు వెనక చూసికోకుండా దానిని చూసినవారందరూ షేర్ చేసేస్తారు.  దానివల్ల తప్పుడుసమాచారం ప్రజలందరికీ చేరిపోతోంది.
అలా సోషల్ మీడీయాలో విసృతంగా ఉన్న ఒక తప్పుడు ప్రచారం, స్వాతంత్ర పోరాటంలో ఆర్.ఎస్.ఎస్ పాత్ర ఎమీలేదని. ఇప్పుడుమనం అందులో ఉన్న సమాచారంతో నిజానిజాలు తెలుసుకుంటే, స్వాతంత్రపోరాటంలో ఆర్.ఎస్.ఎస్ ఎటువంటి పాత్రపోషించిందో మనకి అర్ధమౌతుంది

1921 వ సంవత్సరం  కేరళలోని మలబార్ తీరంలో మోప్లారైతుల తిరుగుబాటు జరిగింది. దానికి కాంగ్రేస్ మద్దతు ఇచ్చింది.  ఆ రైతుల ఉద్యంలోకి కొందరు మతోన్మాదులు చేరి ఉద్యమాన్ని హింసాత్మకం చేసేశారు. దానిలో ఎందరో హిందువులు దారుణమైన ఊచకోతకు గురయ్యారు.
ఆ ఉద్యమం పరిధులు దాటి హింసాత్మక రూపం దాల్చడంతో కాంగ్రేస్ దానినుండీ బయటకి వచ్చేసింది. ఇంతజరిగినా, హిందువులను ఊచకోత కోసిన మతోన్మాదులపై ఏవిధమైన చర్యలు తీసుకోలేదు.
ఈ విషయాలన్నీ మనసులో ఉండడంతో డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ గారు  హిందువులకి రక్షణగా ఉండడంకోసం 1925  లో  RSSను స్థాపించారు. అప్పటికే హెడ్గేవర్ గారు స్వాతంత్రపోరాటంలో చురుకుగా పాల్గొంటున్నారు. తనే ఒక సంస్థను స్థాపించినా,  పోరాటంలో ఆయన చాలాకాలం కాంగ్రేస్తో కలిసే నడిచారు.
డా.హెడ్గేవార్ స్వయంగా కాంగ్రెస్ కార్యకర్త. లోకమాన్య తిలక్ వంటి గొప్ప నాయకులతో కలిసి చాలాకాలం పనిచేశారు. విప్లవ కార్యకలాపాలలో పాల్గొని 1921లో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించారు కూడా. ఆ సందర్భంగా సాగిన కోర్టు విచారణలో భారత స్వాతంత్ర్య పోరాటాన్ని గురించి గట్టిగా వాదించడమే కాక తన చర్యలను సమర్ధించుకున్నారు. 

RSS:భారతీయ జీవనవిధాన ప్రతినిధి- రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)

(హాయ్ అండి, ఇది నా యూట్యూబ్ చానెల్(sailorbook), అందరికీ పనికివచ్చే విషయాలమీద వీడీయోస్ చేస్తున్నాను.
ఈ చానెల్ నేను భారతీయ మేధావుల గొప్పదనం, ఇంకా  హిస్టరీ గురించి నాకు తెలిసినవిషయాలు చెప్పడానికి ప్రారంభించాను.
మీరందరూ నాచానెల్ కి సబ్స్క్రైబ్ చేసి, వీడీయో చూసి, మీ ఫీడ్-బాక్ నాకు తెలియజెయ్యండి. ఎప్పటికప్పుడు లోపాలను సవరించుకుంటూ మరిన్న్ని మంచి వీడీయోలు చేస్తాను.
మీ అందరూ సహకరిస్తే, పూర్తిగా డెడికేటెడ్ గా ఇటువంటి వీడీయోలు మరిన్ని చేయ్యాలనుకుంటున్నాను.  మీ ప్రోత్సాహం నాకు మరింత ఉత్సాహాన్నిస్తుంది.)

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, సంక్షిప్తంగా ఆర్ ఎస్ ఎస్. అణువణువునా దేశభక్తి నిండిన కోట్లమంది కార్యకర్తల బలం ఉన్న ఒక సాంస్కృతిక సంస్థ. దేశభక్తిని ప్రచారం చెయ్యడంలోనూ, అనికోని విపత్తులు వచ్చి ప్రజలు ఇబ్బందిపడుతున్న సమయాల్లోనూ, నేనున్నానంటూ ముందుకువచ్చి బాధితులకి అండగానిలబడుతూ తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది.
ఈ సంస్థలో, అతిసాధారణ వ్యక్తులుంటారు, పెద్దపెద్ద ఇంజనీర్లు,డాక్టర్లు, గొప్ప గొప్ప మేధావులుంటారు.  ప్రపంచమంతా పేరున్న రాజకీయనాయకులుంటారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన వీరంతా  కలిసి భారతదేశ అభివృద్ధి కోసం  తమకు అప్పగించబడిన పనిని మౌనంగా చేసుకునిపోతూ ఉంటారు.
వ్యక్తిగా వారు ఎంతగొప్పవారైనా కావచ్చు, కానీ ఆర్ ఎస్ ఎస్ దృష్టిలో వారంతా కార్యకర్తలు మాత్రమే. ఒక్కసారి ఆ సంస్థ కార్యాలయంలోకి అడుగుపెడితే కులం,పేదా,ధనిక,చిన్నా,పెద్దా లాంటి భావనలు పక్కకి పెట్టి ఖాకీ నిక్కరు తొడుక్కుని క్రమశిక్షణతో మెలగాల్సిందే.

వందసంవత్సరాల వ్యవస్థాపక మహోత్సవానికి ఎంతో దగ్గరలోఉన్న ఆర్ ఎస్ ఎస్, తన జీవితకాలంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూసింది. అన్యాయంగా తనపై 2 సార్లు నిందవేసి నిషేధానికి గురిచేసినా, ప్రజల నమ్మకాన్ని కోల్పోలేదు. ఎప్పటికప్పుడు తన నిజాయితీని  ప్రూవ్ చేసుకుంటూ తన లక్ష్యంవైపు సాగిపోతోంది..
అభిమానులంతా సంఘ్ పరివార్ అని ఎంతో ప్రేమగా పిలుచుకుంటారు. అదేసమయంలో ప్రత్యర్ధులు చెడ్డీ గ్యాంగ్, మతోన్మాదులగుంపు అని విమర్శిస్తూ తమ నోటి కండూతిని తీర్చుకుంటూ ఉంటారు. ఎవరు ఏమైనా అననీ RSS మాత్రం పొగడ్తలకి పొంగిపోదు, పనికిమాలిన విమర్శలను పట్టించుకోదు. మౌనంగా తనపని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది.
 అది 1897, జూన్ 22.  ఆ రోజు విక్టోరియా రాణి 60వ పట్టాభిషేక వార్షికోత్సవం భారతదేశంలోకూడా ఎంతో ఘనంగా  జరుగుతోంది. కానీ దీనిపై ఒక ఎనిమిదేళ్ల బాలుడు మాత్రం చాలా దుఃఖంతో ఉన్నాడు.పాఠశాలలో జరిగిన వేడుకలలో పాల్గొనకుండా ఆ బాలుడు ఇంటికి తిరిగి వచ్చి, పుస్తకాలు పక్కన పడేసి, ఓ మూలన కూర్చున్నాడు.
 ఆ బాలుణ్ని చూసి సోదరుడు, వేడుకల్లో నువ్వు పాల్గొనట్లేదా? అని ప్రశ్నించాడు.
''లేదు, మన సంప్రదాయాలను నాశనం చేసిన ఈ బ్రిటీష్ వాళ్ల వేడుకలను మనమెలా జరుపుకోగలం?'' అని ప్రశ్నించాడు ఆ బాలుడు. ఆ బాలుడే RSS వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్

గురువారం, ఏప్రిల్ 02, 2020

క్వారంటైన్ భయపడాల్సిన విషయమా?ముఖ్యంగా ముస్లింలు


క్వారంటైన్ భయపడాల్సిన విషయమా?
ముఖ్యంగా ముస్లింలు


క్వారంటైన్ భయపడాల్సిన విషయమా? ముఖ్యంగా ముస్లింలు