గురువారం, మార్చి 26, 2020

ట్రాయ్ యుద్ధం -Trojan war - Part2

మొదటిపార్టులో, యుద్దం మొదలవ్వకముందు, గ్రీకులు ఇథాకా రాజు ఒడిస్సియస్తో ట్రోజన్లకి శాంతి సందేశం పంపారని చెప్పాను కదా, కానీ ఆ ప్రతిపాదనని ప్రయాం తిరస్కరించడంతో, ఒడిస్సియస్ ఇంకొక ప్రతిపాదన చేస్తాడు. పారిస్, మెనెలేయస్ వీరిద్దరి వల్లే ఇంత యుద్ధం జరిగేలాఉంది కనుక, వాళ్ళిద్దరికీ 1 టు 1 ఫైట్ పెడదాం, అందులో ఎవరు గెలిస్తే వారికే హెలెన్ సొంతం అన్నాడు. ఈ ప్రతిపాదనకి ప్రయాం అంగీకరించాడు. కానీ పశువుల కాపరి ఇంట్లో పెరిగిన పారిస్ కు యుద్ధ విద్యల్లో పెద్దగా ప్రావీణ్యం ఉండదు.. అతణ్ని మెనెలేయస్ ఈజీగా ఓడిస్తాడని అంతా అనుకున్నారు. తాను ఓడిపోతే హెలెన్ దక్కదన్న సంగతి పారిస్ కు తెలుసు. అందుకే మెనెలేయస్ తో వన్ టూ వన్ పోరాటంలో గెలవడానికి శాయశక్తులా ప్రయత్నించాడు కానీ అతడి చేతిలో తీవ్రంగా గాయపడి క్రిందపడిపోయాడు. పారిస్ చనిపోయాడా లేదా అన్నది నిర్ధారించుకోకుండానే మెనెలేయస్ యుద్ధం ముగిసిందని ప్రకటిస్తాడు. కానీ కొన ఊపరితో ఉన్న పారిస్ తిరిగి లేస్తాడు. కానీ అప్పటికే చీకటి కావడంతో పోటీ అక్కడితో ముగుస్తుంది. అలా ఆ 1 టూ 1 పోరాటం ఫలితాన్ని ఇవ్వకుండానే ముగుస్తుంది. తర్వాత రోజు గ్రీకులకు, ట్రోజన్ల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ పరిణామాలను చూసి మెనెలేయస్ సంతోషించాడు. ఎందుకంటే అతను యుద్ధం కొనసాగాలనే కోరుకున్నాడు,కారణం అతడి లక్ష్యం హెలెన్ మాత్రమే కాదు. ట్రాయ్ ను సర్వనాశనం చేయడం.

వీడియో చూడడానికి ఈ క్రింద లింక్ క్లిక్ చేయ్యండి
ట్రాయ్ యుద్ధం -Trojan war - Part2

భారతీయ ఆత్మను ప్రతిబింబించే గోఆధారిత వ్యవసాయంఫ్రెండ్స్ గో ఆధారిత వ్యవసాయం గురించి ఒక వీడియో చేశాను. చూసి మీకు నచ్చినట్లయితే, నా చానెల్ కి సబ్స్క్రైబ్ చెయ్యండి.

భారతీయ జీవన విధానంలో  ఆవును ఒకజంతువుగా మాత్రమే కాక కుటుంబంలో ఒక భాగంగా చూస్తారు. అందుకే, వట్టిపోయిన ఆవుకి ఎండుగడ్డయినా పెట్టి మేపుతారు గానీ, వదులుకోరు. కానీ రాను రాను డబ్బు మానవజీవితంలో ప్రతీ బంధాన్నీ ప్రభావితం చెయ్యడంతో పశుపోషణ కూడా పూర్తిస్థాయి వాణిజ్యరూపానికి మారిపోయింది.
దానితో రైతుకు పశువుతో ఉండే సున్నితమైన సంబంధంకూడా దెబ్బతుంటోంది. పాలుఇచ్చినంతవరకే పశువులని మేపుతూ, అవి వట్టిపోయాక దళారులచేతుల్లో పెట్టి వదిలించుకుంటున్నారు. అవి అక్కడినుంచీ కబేళాలకి చేరుకుంటున్నాయి.
ఇలా పశువులను కబేళాలకు తరలించడాన్ని చాలామంది సాంప్రదాయవాదులు వ్యతిరేకిస్తున్నారు.కానీ, ఇలా వట్టిపోయిన ఆవుల్ని వదిలించుకోవడాన్ని, ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా విమర్శించలేం. ఎందుకంటే  ఇందులో రైతుల్ని తప్పు పట్టడానికికూడా  ఏమీలేదు, ఇదివరకటి రోజుల్లో, పశువులని ఊరిబయట పచ్చిక మైదనాలలో విడిచిపెట్టి మేపేవారు.
కానీ ఇప్పుడు రియల్ ఏస్టేటు  పుణ్యమా అని, పల్లెల్లోకూడా గడ్డి లభ్యత తగ్గిపోయింది. ప్రతీరోజూ డబ్బుపెట్టి గడ్డి కొని పశువుని పోషించడం చిన్న రైతులకి సాధయమయ్యే పనికాదు. అందుకే రైతులుకూడా పశువులని దళారులచేతుల్లోపేట్టెస్తున్నారు.
కనుక వట్టిపోయిన పశువుని వదిలించుకోవడం తప్పు అనిభావించేవారు, ఆ పశువు ద్వారా రైతుపై పడే భారాన్ని తగ్గించుకోవడానికి ఏంచెయ్యాలో కూడా సూచించవలసి ఉంటుంది. లేకపోతే రైతు ఆర్ధికంగా కుదేలయ్యే అవకాశం ఉంది.


వీడియో చూడడానికి ఈ క్రింద లింక్ క్లిక్ చేయ్యండి
భారతీయ ఆత్మను ప్రతిబింబించే గోఆధారిత వ్యవసాయం