శుక్రవారం, మార్చి 20, 2020

నిర్భయ కేసులో ఏపీ సింగ్ పాత్ర


నిర్భయ దోషులకి ఉరిశిక్ష అమలు. ఉదయాన్నేలేవగానే వినిపించిన వార్త.
ఒక వ్యక్తి మరణిస్తే, ఆవ్యక్తి మనకి తెలిసినా తెలియకపోయినా బాధపడతాం. కానీ నిర్భయ దోషుల మరణంకోసం దేశంలో మెజారిటీ ప్రజలు ఎదురుచూశారు. కారణం వారు చేసిన ఘాతుకం
నిర్భయ, భారతీయులెవ్వరికీ పరిచయం అక్కర్లేనిపేరు. చరిత్ర క్లుప్తంగా చెప్పాలంటే, 7 సంవత్సరాలక్రితం కదులుతున్న బస్సులో ఒక పారామెడికల్ విద్యార్ధినిని 6 యువకులు  అత్యాచారంచేసి, అమెని  ఆమెతోపాటు ఉన్న ఆమె స్నేహితుడిని దారుణంగా గాయపరిచి, ఢిల్లీలో గజగజ వణికించే చలిలో రోడ్డుమీదపడేసి వెళ్ళిపోయారు.
ఈ ఆరుగురిలో ఒకడు మైనర్ కావడంతో 3 సంవత్సరాల శిక్షతో సులభంగా తప్పించుకోగలిగాడు. మిగిలిన ఐదుగురిలో ఒకడు జైలులోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు సుదీర్ఘ విచారణ తరువాత ఉరికంబం ఎక్కారు.
ఇది అందరిఈ తెలిసిన చరిత్రే. కొత్తగా ఇందులోచెప్పుకునే ఏమీలేదు. ఈ కేసుతీవ్రతకి దేశమ్మొత్తం చలించిపోయింది. ప్రజలలో వచ్చిన అలజడి నిర్భయచట్టం రూపకల్పనకి దారితీసింది.
ప్రాధమికంగా లభించిన ఆధారాలన్నీ నిందితులేదోషులని స్పష్టంగా నిరూపించాయి. ఆ సమయంలో రంగప్రవేశంచేశాడు లాయర్ ఏపి సింగ్. నిందితుల తరపున వకాల్తా పుచ్చుకుంటూ బాధితురాలినే విమర్శిస్తూ "అర్ధరాత్రి బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగే ఇలాంటి కూతురే గనక నాకు ఉంటే నేనే పెట్రోల్ పోసి చంపేవాడిని " అంటూ ఆయనచేసిన  వ్యాఖ్య అందరికీ ఆశ్చర్యాన్ని,కోపాన్ని కలిగించింది.
సమాజంలో మేధావి వర్గం అని ఒక బ్యాచ్ ఉంటారు. ఏదయినా దారుణంజరిగినప్పుడు నిందితులవైపు నుండీ అలోచిస్తూ, వారు ఆ దారుణానికి పాల్పడడనికి కారణం ఏమై ఉంటుందా అని అలోచిస్తూ ఉంటారు. అటువంటివారి వాదనలు ఈ లాయరుగారికి బలాన్నిచ్చాయి.

నిదితుల వైపు న్యాయం ఎంతమాత్రం లేదని ఈయనకు కూడా తెలుసు. ఇటువంటి దోషులతరపున ఎందుకు వాదిస్తున్నావ్ అని ఎవరైనా అడిగితే, దోషులలో ఒకడైన ముఖేష్ కి  3 నెలల పాప ఉంది, ఆమెను చూసి జాలివేసి ఈకేసు ఒప్పుకున్నాను అన్నాడు. మరి చనిపోయిన వారి తల్లితండ్రుల క్షోభ మాటేంటి అని ఎవరైనా అడిగితే, వీరందరికీ ఉరి విధిస్తే దేశంలో రేపులు,మర్డర్లు తగ్గిపోతాయా అంటూ వితండవాదంచేశాడు.
అరోజుమొదలు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితరాజ్యాంగం గా ఘనత వహించిన భారతరాజ్యాంగానికి ప్రాణప్రదమైన న్యాయవ్యవస్తతో  7 సంవత్సరాలుగా ఆయన ఫుట్-బాల్ ఆడుకున్నాడు.
దోషులకి ఉరిశిక్ష తప్పించడమే తన లక్షం అని ప్రకటించాడు. అలాఅని ఆయన ఉరి శిక్ష వ్యతిరేక ఉద్యమకారుడో, గొప్ప  ప్రజాహక్కుల పోరాటయోధుడో కాదు. కేవలం ఒక లాయర్. తన కుటిల లాజిక్కులతో భారతన్యాయ వ్యవస్థ లో ఉన్న లోపాలను తన క్లైంట్లకు అనుకూలంగా మలుచుకుంటూ వారిని కాపాడుకుంటూ వచ్చాడు.

పూర్తి వివరాలకోసం ఈ వీడియో చూడండి
నిర్భయ కేసులో ఏపీ సింగ్ పాత్ర