గురువారం, మార్చి 26, 2020

ట్రాయ్ యుద్ధం -Trojan war - Part2

మొదటిపార్టులో, యుద్దం మొదలవ్వకముందు, గ్రీకులు ఇథాకా రాజు ఒడిస్సియస్తో ట్రోజన్లకి శాంతి సందేశం పంపారని చెప్పాను కదా, కానీ ఆ ప్రతిపాదనని ప్రయాం తిరస్కరించడంతో, ఒడిస్సియస్ ఇంకొక ప్రతిపాదన చేస్తాడు. పారిస్, మెనెలేయస్ వీరిద్దరి వల్లే ఇంత యుద్ధం జరిగేలాఉంది కనుక, వాళ్ళిద్దరికీ 1 టు 1 ఫైట్ పెడదాం, అందులో ఎవరు గెలిస్తే వారికే హెలెన్ సొంతం అన్నాడు. ఈ ప్రతిపాదనకి ప్రయాం అంగీకరించాడు. కానీ పశువుల కాపరి ఇంట్లో పెరిగిన పారిస్ కు యుద్ధ విద్యల్లో పెద్దగా ప్రావీణ్యం ఉండదు.. అతణ్ని మెనెలేయస్ ఈజీగా ఓడిస్తాడని అంతా అనుకున్నారు. తాను ఓడిపోతే హెలెన్ దక్కదన్న సంగతి పారిస్ కు తెలుసు. అందుకే మెనెలేయస్ తో వన్ టూ వన్ పోరాటంలో గెలవడానికి శాయశక్తులా ప్రయత్నించాడు కానీ అతడి చేతిలో తీవ్రంగా గాయపడి క్రిందపడిపోయాడు. పారిస్ చనిపోయాడా లేదా అన్నది నిర్ధారించుకోకుండానే మెనెలేయస్ యుద్ధం ముగిసిందని ప్రకటిస్తాడు. కానీ కొన ఊపరితో ఉన్న పారిస్ తిరిగి లేస్తాడు. కానీ అప్పటికే చీకటి కావడంతో పోటీ అక్కడితో ముగుస్తుంది. అలా ఆ 1 టూ 1 పోరాటం ఫలితాన్ని ఇవ్వకుండానే ముగుస్తుంది. తర్వాత రోజు గ్రీకులకు, ట్రోజన్ల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ పరిణామాలను చూసి మెనెలేయస్ సంతోషించాడు. ఎందుకంటే అతను యుద్ధం కొనసాగాలనే కోరుకున్నాడు,కారణం అతడి లక్ష్యం హెలెన్ మాత్రమే కాదు. ట్రాయ్ ను సర్వనాశనం చేయడం.

వీడియో చూడడానికి ఈ క్రింద లింక్ క్లిక్ చేయ్యండి
ట్రాయ్ యుద్ధం -Trojan war - Part2

భారతీయ ఆత్మను ప్రతిబింబించే గోఆధారిత వ్యవసాయంఫ్రెండ్స్ గో ఆధారిత వ్యవసాయం గురించి ఒక వీడియో చేశాను. చూసి మీకు నచ్చినట్లయితే, నా చానెల్ కి సబ్స్క్రైబ్ చెయ్యండి.

భారతీయ జీవన విధానంలో  ఆవును ఒకజంతువుగా మాత్రమే కాక కుటుంబంలో ఒక భాగంగా చూస్తారు. అందుకే, వట్టిపోయిన ఆవుకి ఎండుగడ్డయినా పెట్టి మేపుతారు గానీ, వదులుకోరు. కానీ రాను రాను డబ్బు మానవజీవితంలో ప్రతీ బంధాన్నీ ప్రభావితం చెయ్యడంతో పశుపోషణ కూడా పూర్తిస్థాయి వాణిజ్యరూపానికి మారిపోయింది.
దానితో రైతుకు పశువుతో ఉండే సున్నితమైన సంబంధంకూడా దెబ్బతుంటోంది. పాలుఇచ్చినంతవరకే పశువులని మేపుతూ, అవి వట్టిపోయాక దళారులచేతుల్లో పెట్టి వదిలించుకుంటున్నారు. అవి అక్కడినుంచీ కబేళాలకి చేరుకుంటున్నాయి.
ఇలా పశువులను కబేళాలకు తరలించడాన్ని చాలామంది సాంప్రదాయవాదులు వ్యతిరేకిస్తున్నారు.కానీ, ఇలా వట్టిపోయిన ఆవుల్ని వదిలించుకోవడాన్ని, ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా విమర్శించలేం. ఎందుకంటే  ఇందులో రైతుల్ని తప్పు పట్టడానికికూడా  ఏమీలేదు, ఇదివరకటి రోజుల్లో, పశువులని ఊరిబయట పచ్చిక మైదనాలలో విడిచిపెట్టి మేపేవారు.
కానీ ఇప్పుడు రియల్ ఏస్టేటు  పుణ్యమా అని, పల్లెల్లోకూడా గడ్డి లభ్యత తగ్గిపోయింది. ప్రతీరోజూ డబ్బుపెట్టి గడ్డి కొని పశువుని పోషించడం చిన్న రైతులకి సాధయమయ్యే పనికాదు. అందుకే రైతులుకూడా పశువులని దళారులచేతుల్లోపేట్టెస్తున్నారు.
కనుక వట్టిపోయిన పశువుని వదిలించుకోవడం తప్పు అనిభావించేవారు, ఆ పశువు ద్వారా రైతుపై పడే భారాన్ని తగ్గించుకోవడానికి ఏంచెయ్యాలో కూడా సూచించవలసి ఉంటుంది. లేకపోతే రైతు ఆర్ధికంగా కుదేలయ్యే అవకాశం ఉంది.


వీడియో చూడడానికి ఈ క్రింద లింక్ క్లిక్ చేయ్యండి
భారతీయ ఆత్మను ప్రతిబింబించే గోఆధారిత వ్యవసాయం

సోమవారం, మార్చి 23, 2020

కరోనా ఇది చైనా సృష్టించిన భూతమా?

కరోనా,కరోనా,కరోనా కరీనా మాత్రమే తెలిసిన మనకి సరిగ్గా రెండునెలల క్రితం పరిచయమయ్యిందీ కరోనా. మొదట విన్నప్పుడు ఆ ఎక్కడో చైనాలోపుట్టింది , మనకేమవ్తుందిలే అనిపించింది అందరికీ. వారం రోజుల క్రితం వరకూ చైనాలో ఇంతమంది చనిపోయారు, ఇటలీలో పరిస్థితి ఇలాఉంది అంటుంటే, ఆ మనవరకూ ఏం రాదులే, ఏంకాదులే అని ధైర్యంగానే అనిపించింది.
కొన్ని రోజుల క్రితం  సినిమా హీరోలు రాంచరణ్, ఎంటీఅర్ లు ఇద్దరూ కలిసి  కరోనాతో జాగ్రత్తగా ఉండండి అంటూ వీడీయోలు రిలీజ్ చేస్తే పాన్ ఇండియా మూవీ ఎదో చేస్తున్నారుకదా, ప్రచారంకోసం ఆ అకేషన్ని వాడేసుకుంటున్నారేమో అనిపించింది.
కానీ రెండురోజుల నుండీ జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే నిజంగానే భయంవేస్తోంది.  కరోనా విశ్వరూపం చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది.
అసలు ఈ కరోనా మనజీవితాల్లోకి ఎలా వచ్చింది అంటే వాడెవడో చైనావాడు అడ్డమైన చెత్తా తిని గబ్బిలాల్లో ఉండే ఈ వైరస్ను వాడికంటించుకోవడామేకాక, మొత్తం ప్రపంచం మీదకే వదిలాడంటున్నారు.

వీడియో చూడడానికి ఈ క్రింద లింక్ క్లిక్ చేయ్యండి
కరోనా ఇది చైనా సృష్టించిన భూతమా?

ఆదివారం, మార్చి 22, 2020

మహాభారత యుద్ధానికి ఇంచుమించు సరిసమానమైన ట్రాయ్ యుద్ధం

హెలెన్ ఒక గ్రీకు రాజకుమారి, చూపుతిప్పుకోలేనంత గొప్ప అందం ఆమెసొంతం. అందంలో చుట్టుపక్కల రాజ్యాలలో ఆమెకు ఎదురు రాగలిగినవాళ్ళేలేరు. ఆమెకు ఇష్టం ఉందో లేదో తెలియని స్థితిలో స్పార్టా రాజు మెనెలేయస్ ని పెళ్ళిచేసుకుంటుంది. ఒకరోజు ట్రాయ్ యువరాజు పారిస్ ఆదేశానికి రాయబారిగా వచ్చాడు. రాజు భార్య అయిన హెలెన్ ని చూసి మనసు పారేసుకున్నాడు. ఆమెది కూడా అదేపరిస్థితి. అదేశమయంలో మెనె లేయస్ ఒక రాచకార్యం నిమిత్తం వేరే రాజ్యానికి వెళ్ళడం వీరికి కలిసివచ్చింది. ఇద్దరూ అక్కడినుండీ పారిపోయి ట్రాయ్ రాజ్యానికి వెళ్ళిపోయారు. తిరిగివచ్చిన మెనెలేయస్ , తనకు జరిగిన ద్రోహం తెలిసి రగిలిపోయాడు. చుట్టుపక్కల గ్రీకు రాజ్యాలన్నింటిక్నీ కలుపుకుని తనభార్యను ఎత్తుకెళ్ళిన ట్రాయ్ రాజ్యం మీద యుద్దం ప్రకటించాడు. మెనెలేయస్ కి జరిగిన అవమానాన్ని గ్రీకులందరూ తమకు జరిగిన అవమానంగా భావించారు. వందలకొద్దీ యుద్ధనౌకలతో మెనెలేయస్ కి తోడునిలబడి ట్రాయ్ మీద యుద్ధం చేశారు. ఆ యుద్దం దాదాపు 10 సంవత్సరాలు జరిగింది. చివరికి మెనెలేయస్సే గెలిచాడు. తన భార్య హెలెన్ ను తిరిగి తెచ్చుకున్నాడు. కానీ ఇరువైపులా అపార ధన, ఆస్థి నస్ఠం జరిగింది. ఇది క్లుప్తం గా ట్రోజన్ యుద్ధం చరిత్ర. అందాలరాశికోసం జరిగిన ఆ యుద్ధం కాలక్రమంలో జానపదుల నోళ్ళలో పడి అందమైన ప్రేమ కధగా మారిపోయింది. అనేకమంది కళకారులు ఆ కధను గానం చేశారు. తరాలు మారుతున్నకొద్దీ ఆ యుద్దం, దాని చరిత్ర గ్రీకు పురాణగాధల్లో ఒకటిగా స్థానం సంపాదించుకుంది.

వీడియో చూడడానికి ఈ క్రింద లింక్ క్లిక్ చేయ్యండి
మహాభారత యుద్ధానికి ఇంచుమించు సరిసమానమైన ట్రాయ్ యుద్ధం

శుక్రవారం, మార్చి 20, 2020

నిర్భయ కేసులో ఏపీ సింగ్ పాత్ర


నిర్భయ దోషులకి ఉరిశిక్ష అమలు. ఉదయాన్నేలేవగానే వినిపించిన వార్త.
ఒక వ్యక్తి మరణిస్తే, ఆవ్యక్తి మనకి తెలిసినా తెలియకపోయినా బాధపడతాం. కానీ నిర్భయ దోషుల మరణంకోసం దేశంలో మెజారిటీ ప్రజలు ఎదురుచూశారు. కారణం వారు చేసిన ఘాతుకం
నిర్భయ, భారతీయులెవ్వరికీ పరిచయం అక్కర్లేనిపేరు. చరిత్ర క్లుప్తంగా చెప్పాలంటే, 7 సంవత్సరాలక్రితం కదులుతున్న బస్సులో ఒక పారామెడికల్ విద్యార్ధినిని 6 యువకులు  అత్యాచారంచేసి, అమెని  ఆమెతోపాటు ఉన్న ఆమె స్నేహితుడిని దారుణంగా గాయపరిచి, ఢిల్లీలో గజగజ వణికించే చలిలో రోడ్డుమీదపడేసి వెళ్ళిపోయారు.
ఈ ఆరుగురిలో ఒకడు మైనర్ కావడంతో 3 సంవత్సరాల శిక్షతో సులభంగా తప్పించుకోగలిగాడు. మిగిలిన ఐదుగురిలో ఒకడు జైలులోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు సుదీర్ఘ విచారణ తరువాత ఉరికంబం ఎక్కారు.
ఇది అందరిఈ తెలిసిన చరిత్రే. కొత్తగా ఇందులోచెప్పుకునే ఏమీలేదు. ఈ కేసుతీవ్రతకి దేశమ్మొత్తం చలించిపోయింది. ప్రజలలో వచ్చిన అలజడి నిర్భయచట్టం రూపకల్పనకి దారితీసింది.
ప్రాధమికంగా లభించిన ఆధారాలన్నీ నిందితులేదోషులని స్పష్టంగా నిరూపించాయి. ఆ సమయంలో రంగప్రవేశంచేశాడు లాయర్ ఏపి సింగ్. నిందితుల తరపున వకాల్తా పుచ్చుకుంటూ బాధితురాలినే విమర్శిస్తూ "అర్ధరాత్రి బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగే ఇలాంటి కూతురే గనక నాకు ఉంటే నేనే పెట్రోల్ పోసి చంపేవాడిని " అంటూ ఆయనచేసిన  వ్యాఖ్య అందరికీ ఆశ్చర్యాన్ని,కోపాన్ని కలిగించింది.
సమాజంలో మేధావి వర్గం అని ఒక బ్యాచ్ ఉంటారు. ఏదయినా దారుణంజరిగినప్పుడు నిందితులవైపు నుండీ అలోచిస్తూ, వారు ఆ దారుణానికి పాల్పడడనికి కారణం ఏమై ఉంటుందా అని అలోచిస్తూ ఉంటారు. అటువంటివారి వాదనలు ఈ లాయరుగారికి బలాన్నిచ్చాయి.

నిదితుల వైపు న్యాయం ఎంతమాత్రం లేదని ఈయనకు కూడా తెలుసు. ఇటువంటి దోషులతరపున ఎందుకు వాదిస్తున్నావ్ అని ఎవరైనా అడిగితే, దోషులలో ఒకడైన ముఖేష్ కి  3 నెలల పాప ఉంది, ఆమెను చూసి జాలివేసి ఈకేసు ఒప్పుకున్నాను అన్నాడు. మరి చనిపోయిన వారి తల్లితండ్రుల క్షోభ మాటేంటి అని ఎవరైనా అడిగితే, వీరందరికీ ఉరి విధిస్తే దేశంలో రేపులు,మర్డర్లు తగ్గిపోతాయా అంటూ వితండవాదంచేశాడు.
అరోజుమొదలు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితరాజ్యాంగం గా ఘనత వహించిన భారతరాజ్యాంగానికి ప్రాణప్రదమైన న్యాయవ్యవస్తతో  7 సంవత్సరాలుగా ఆయన ఫుట్-బాల్ ఆడుకున్నాడు.
దోషులకి ఉరిశిక్ష తప్పించడమే తన లక్షం అని ప్రకటించాడు. అలాఅని ఆయన ఉరి శిక్ష వ్యతిరేక ఉద్యమకారుడో, గొప్ప  ప్రజాహక్కుల పోరాటయోధుడో కాదు. కేవలం ఒక లాయర్. తన కుటిల లాజిక్కులతో భారతన్యాయ వ్యవస్థ లో ఉన్న లోపాలను తన క్లైంట్లకు అనుకూలంగా మలుచుకుంటూ వారిని కాపాడుకుంటూ వచ్చాడు.

పూర్తి వివరాలకోసం ఈ వీడియో చూడండి
నిర్భయ కేసులో ఏపీ సింగ్ పాత్ర

సోమవారం, మార్చి 02, 2020

వాస్కో ద గామా

వాస్కో ద గామా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.

ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే సక్స్క్రైబ్ అవ్వండి.

పవర్ పాయింట్ ఉపయోగించి యానిమేషన్ చెయ్యడం ఎలా?

పవర్ పాయింట్ ఉపయోగించి యానిమేషన్ చెయ్యడం గురించి ఈ వీడియో లో తెలుసుకుందాం.
ఈ వీడియో చూసి మీకునచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి.