ఆదివారం, మార్చి 22, 2020

మహాభారత యుద్ధానికి ఇంచుమించు సరిసమానమైన ట్రాయ్ యుద్ధం

హెలెన్ ఒక గ్రీకు రాజకుమారి, చూపుతిప్పుకోలేనంత గొప్ప అందం ఆమెసొంతం. అందంలో చుట్టుపక్కల రాజ్యాలలో ఆమెకు ఎదురు రాగలిగినవాళ్ళేలేరు. ఆమెకు ఇష్టం ఉందో లేదో తెలియని స్థితిలో స్పార్టా రాజు మెనెలేయస్ ని పెళ్ళిచేసుకుంటుంది. ఒకరోజు ట్రాయ్ యువరాజు పారిస్ ఆదేశానికి రాయబారిగా వచ్చాడు. రాజు భార్య అయిన హెలెన్ ని చూసి మనసు పారేసుకున్నాడు. ఆమెది కూడా అదేపరిస్థితి. అదేశమయంలో మెనె లేయస్ ఒక రాచకార్యం నిమిత్తం వేరే రాజ్యానికి వెళ్ళడం వీరికి కలిసివచ్చింది. ఇద్దరూ అక్కడినుండీ పారిపోయి ట్రాయ్ రాజ్యానికి వెళ్ళిపోయారు. తిరిగివచ్చిన మెనెలేయస్ , తనకు జరిగిన ద్రోహం తెలిసి రగిలిపోయాడు. చుట్టుపక్కల గ్రీకు రాజ్యాలన్నింటిక్నీ కలుపుకుని తనభార్యను ఎత్తుకెళ్ళిన ట్రాయ్ రాజ్యం మీద యుద్దం ప్రకటించాడు. మెనెలేయస్ కి జరిగిన అవమానాన్ని గ్రీకులందరూ తమకు జరిగిన అవమానంగా భావించారు. వందలకొద్దీ యుద్ధనౌకలతో మెనెలేయస్ కి తోడునిలబడి ట్రాయ్ మీద యుద్ధం చేశారు. ఆ యుద్దం దాదాపు 10 సంవత్సరాలు జరిగింది. చివరికి మెనెలేయస్సే గెలిచాడు. తన భార్య హెలెన్ ను తిరిగి తెచ్చుకున్నాడు. కానీ ఇరువైపులా అపార ధన, ఆస్థి నస్ఠం జరిగింది. ఇది క్లుప్తం గా ట్రోజన్ యుద్ధం చరిత్ర. అందాలరాశికోసం జరిగిన ఆ యుద్ధం కాలక్రమంలో జానపదుల నోళ్ళలో పడి అందమైన ప్రేమ కధగా మారిపోయింది. అనేకమంది కళకారులు ఆ కధను గానం చేశారు. తరాలు మారుతున్నకొద్దీ ఆ యుద్దం, దాని చరిత్ర గ్రీకు పురాణగాధల్లో ఒకటిగా స్థానం సంపాదించుకుంది.

వీడియో చూడడానికి ఈ క్రింద లింక్ క్లిక్ చేయ్యండి
మహాభారత యుద్ధానికి ఇంచుమించు సరిసమానమైన ట్రాయ్ యుద్ధం