గురువారం, మార్చి 26, 2020

భారతీయ ఆత్మను ప్రతిబింబించే గోఆధారిత వ్యవసాయం



ఫ్రెండ్స్ గో ఆధారిత వ్యవసాయం గురించి ఒక వీడియో చేశాను. చూసి మీకు నచ్చినట్లయితే, నా చానెల్ కి సబ్స్క్రైబ్ చెయ్యండి.

భారతీయ జీవన విధానంలో  ఆవును ఒకజంతువుగా మాత్రమే కాక కుటుంబంలో ఒక భాగంగా చూస్తారు. అందుకే, వట్టిపోయిన ఆవుకి ఎండుగడ్డయినా పెట్టి మేపుతారు గానీ, వదులుకోరు. కానీ రాను రాను డబ్బు మానవజీవితంలో ప్రతీ బంధాన్నీ ప్రభావితం చెయ్యడంతో పశుపోషణ కూడా పూర్తిస్థాయి వాణిజ్యరూపానికి మారిపోయింది.
దానితో రైతుకు పశువుతో ఉండే సున్నితమైన సంబంధంకూడా దెబ్బతుంటోంది. పాలుఇచ్చినంతవరకే పశువులని మేపుతూ, అవి వట్టిపోయాక దళారులచేతుల్లో పెట్టి వదిలించుకుంటున్నారు. అవి అక్కడినుంచీ కబేళాలకి చేరుకుంటున్నాయి.
ఇలా పశువులను కబేళాలకు తరలించడాన్ని చాలామంది సాంప్రదాయవాదులు వ్యతిరేకిస్తున్నారు.కానీ, ఇలా వట్టిపోయిన ఆవుల్ని వదిలించుకోవడాన్ని, ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా విమర్శించలేం. ఎందుకంటే  ఇందులో రైతుల్ని తప్పు పట్టడానికికూడా  ఏమీలేదు, ఇదివరకటి రోజుల్లో, పశువులని ఊరిబయట పచ్చిక మైదనాలలో విడిచిపెట్టి మేపేవారు.
కానీ ఇప్పుడు రియల్ ఏస్టేటు  పుణ్యమా అని, పల్లెల్లోకూడా గడ్డి లభ్యత తగ్గిపోయింది. ప్రతీరోజూ డబ్బుపెట్టి గడ్డి కొని పశువుని పోషించడం చిన్న రైతులకి సాధయమయ్యే పనికాదు. అందుకే రైతులుకూడా పశువులని దళారులచేతుల్లోపేట్టెస్తున్నారు.
కనుక వట్టిపోయిన పశువుని వదిలించుకోవడం తప్పు అనిభావించేవారు, ఆ పశువు ద్వారా రైతుపై పడే భారాన్ని తగ్గించుకోవడానికి ఏంచెయ్యాలో కూడా సూచించవలసి ఉంటుంది. లేకపోతే రైతు ఆర్ధికంగా కుదేలయ్యే అవకాశం ఉంది.


వీడియో చూడడానికి ఈ క్రింద లింక్ క్లిక్ చేయ్యండి
భారతీయ ఆత్మను ప్రతిబింబించే గోఆధారిత వ్యవసాయం

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి