రెండు నెలలక్రితం ఎదోపనిఉండి ఊరు వెళ్ళాల్సివచ్చింది. ఒక్కరోజు మాత్రమే శెలవుదొరకడంతో ఊరిలో దిగిన రోజే పని కంప్లీట్ అయ్యెలాగా ప్లాన్ చేసుకుని ఊళ్ళోదిగాను. అన్ని అనుకున్న ప్రకారమే కంప్లీట్ కావడంతో సాయంత్రం బండి క్యాచ్ చెయ్యడానికి తిరిగి స్టేషనుకి బయలుదేరాను. కృష్ణ నాతోపాటు వచ్చాడు నాకు సెండాఫ్ ఇవ్వడానికి. ఇంకా రైలుస్టార్ట్ అవ్వడానికి అరగంటకి పైగా టైము ఉండడంతో మేమిద్దరం అక్కడే స్టేషనులో నిలపడి మాట్లాడుకుంటున్నాం.ఇంతలో ప్లాట్-ఫారం మీద బండిమీద తిరుగుతూ ఐస్-క్రీము అమ్ముకుంటున్న ఇద్దరు పిల్లలు నాకు కనిపించారు. ఎక్కడో చూసినట్లనిపించింది. దగ్గరకి వచ్చాక బాగాపోల్చుకున్నాను. దుర్గారావు పిల్లలు వాళ్ళు. చటుక్కున దుర్గారావు గుర్తొచ్చాడునాకు.
దుర్గారావు మాస్కూలుదగ్గర ఐస్-క్రీం బండి నడుపుకునేవాడు. రెండు రూపాయలు ఇస్తే పెద్ద బ్రెడ్డు-స్లైస్ మీద ఐస్-క్రీం పెట్టిఇచ్చేవాడు. సినిమాకబుర్లు బాగాచెప్పేవాడు. డబ్బులు లేనప్పుడు అరువు కూడా ఇచ్చేవాడు. మాకందరికి అతనంటే ఎందుకో కొంచెం అభిమానం ఉండేది.అప్పుడప్పుడు తనపిల్లల్ని కూడా తీసుకుని వచ్చేవాడు. మమ్మల్ని వాళ్ళకి చూపిస్తూ మీరుకూడా వీళ్ళలాగా బాగాచదువుకోవాలి అని చెప్పేవాడు. అప్పటికి వాళ్ళు బాగా చిన్నపిల్లలు.ఎమీ అర్ధంకానట్లు నవ్వేవాళ్ళు.ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళయ్యారు.
" ..... ఆమధ్య జబ్బు చేసి దుర్గారావు సడన్ గా పోయాడురా, దానితో వీళ్ళకి చదువుకునే అవకాశం లేకుండా పోయింది. అందుకే వాళ్ళ నాన్న వ్యాపారాన్నే కలిపి చెసుకుంటున్నారు.." అన్నాడు కృష్ణ . అప్పుడు గమనించానువాళ్ళని, పెద్దవాడు కొంచెం బలంగా,పొడుగ్గా ఉన్నాడు. కాని పాపం వాడికి కళ్ళు సరిగ్గా కనపడవనుకుంట, పెద్దపెద్ద సోడాబుడ్డి కళ్ళాద్దాలు వేసుకుని ఉన్నాడు. రెండో వాడికి అన్నీ బాగానే ఉన్నాయి గాని వాడు బక్కగా పొట్టిగా ఉన్నాడు.కాని వాళ్ళిద్దరు కలిపివ్యాపారం చేసుకుంటున్న పద్ధతిచూస్తే నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఇద్దరు కలిపి నడుపుకోవడానికి వీలుగా సైకిలుకి రెండుసీట్లు పెట్టించారు. పెద్దవాడు వెనుక కూర్చుని పెడల్ తొక్కుతుంటే, చిన్నవాడు ముందుసీట్లో కూర్చుని హేండిల్ బార్ చూసుకుంటున్నాడు.
వాళ్ళకేదైనా సాయం చెస్తే బాగుంటుందేమో అనిపించిందినాకు. కృష్ణ ఆపాడునన్ను. కష్టమోనష్టమో వాళ్ళజీవితాలు ఒకపద్దతిలో వాళ్ళుగడుపుతున్నారు.. ఇప్పటివరకు అప్పుకోసంకూడా ఎవరిదగ్గర చెయ్యిచాపినట్లు కూడా నేను చూడలేదు. నాకుతెలిసి నువ్వుఇచ్చినా వాళ్ళు తీసుకోరు అన్నాడు. సరేఅయితే ఎంచేద్దాం అన్నాను. రెండు ఐసులు కొను వాళ్ళదగ్గర,అది చాలు వాళ్ళకి మనం కూడా పుల్ల ఐసులు తినిచాలాకాలం అయినట్లుంది అన్నాడు నవ్వుతూ . ఇంతలో రైలు బయలుదేరుతున్నట్లు ఎనౌన్సుమెంటు రావడంతో నేను వాళ్ళని దగ్గరకిపిలిచి రెండు ఐస్-ఫ్రూట్లు కొని ఒకటి కృష్ణకి ఇచ్చి వీడ్కోలుచెప్పి రైలు ఎక్కాను.

0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి