ఒక్కొక్కసారి మనం అనుకొకుండానో, తీవ్రత అంచనా వెయ్యకుండానో మాటలు వదులుతూ ఉంటాం. తీరా మనతప్పు తెలుసుకునే సరికే జరగవలసిన నష్టం జరిగిపోతుంది. తర్వాత తీరిగ్గా బాధపడడం తప్ప చెయ్యగలిగేది ఎమీఉండదు.
మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఇలాంటి అనుభవమే నాకు ఎదురయ్యింది. ఎదోపనిఉండి మా కాలేజీకి వెళ్ళవలసి వచ్చింది.నా ఫ్రెండు కృష్ణని తోడుగా తీసుకుని వెళ్ళాను. పని పూర్తి అయ్యి బయటకి వచ్చేసరికి దాదాపు మధ్యాహ్నం అయ్యింది.మేము రోడ్డుమీదకి వచ్చేసరికి మాడిగ్రీ క్లాస్-మీట్ శ్యామల ఎదురయ్యింది. అప్పటికి నేను తనని అఖరిసారి కలుసుకుని దాదాపు 5 సంవత్సరాలు అయ్యింది,మరలా ఇప్పుడే కలవడం. మమ్మల్ని చూస్తూనే స్కూటీ పక్కకి ఆపి మాదగ్గరకి వచ్చి నవ్వుతూ పలుకరించింది . ఒక పావుగంట కబుర్లు చెప్పినతర్వాత తాను ఇప్పుడు ఎదో కంప్యూటర్ కోర్సుచేస్తున్నానని, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నానని మరో ఐదు నిముషాలలో క్లాస్ స్టార్ట్ అవుతుంది కనుక మరొకసారి కలుస్తానని చెప్పి వెళ్ళిపోయింది.ఐదు సంవత్సరాలక్రితం కలిసినప్పుడు కూడా ఇలాగే ఎదో కోర్సు చేస్తున్నానని చెప్పింది.
"ఇంక ఈఅమ్మాయి పెళ్ళి-పెటాకులు ఎమీ చేసుకొదేంట్రా, ఎంతసేపూ ఎదోఒక కోర్సు చెయ్యడం తప్ప..." అన్నాను నేను కృష్ణతో ఒక్కొక్కసారి నాగొంతులో నాకుకూడా తెలియకుండా ధ్వనించే చిన్నపాటి వెటకారాన్ని నింపుకుని. కొంతసేపు వాడు ఎమీ మాట్లాడలేదు. తరవాత నెమ్మదిగా అన్నాడు. అలాకాదురా,ఎంతచదువుకున్నా ఎంత అందంగాఉన్నా ఆడపిల్ల పెళ్ళి చెయ్యాలంటే ఈరొజుల్లో కూడా లక్షలకిలక్షలు కట్నాలు ఇవ్వాలి. వీళ్ళ నాన్నేమో చిన్న సైకిలుషాపు నడుపుతాడు. మొన్ననే చాలా కష్టపడి వీళ్ళ అక్కకి పెళ్ళి చేసారు, ఈమెకికూడా చూస్తున్నారు. ఈమెది అయిపొతే వెనుక వీళ్ళ చెల్లి కూడాఉంది అన్నాడు. ఒక్కసారిగా నామాట ఆగిపోయింది. తిరిగి అలోచించి చూస్తే నేనెంత తొందరపడి మాట్లాడానో నాకు అర్ధమయ్యింది. ఆ గిల్టీ ఫీలింగ్ తోనే అనుకుంట కొంచెంసేపు మౌనంగాఉండిపొయాను.
నెను మట్లాడడం అపేసరికి నా పరిస్థితిని కృష్ణ అర్ధంచెసుకున్నట్లున్నాడు నాభుజం మీద చెయ్యి వేసి "అయినా అవన్ని నీకు నీకుమాత్రం ఎలా తెలుస్తాయి లేరా, నీకు చెల్లో అక్కో ఉండి ఉంటే తెలిసేది, నాకు కూడా మొన్న మా ఆక్క పెళ్ళిలో ఈవిషయాలన్నీ కొంచెం అనుభవం లోకి వచ్చాయి,అందుకే అన్నారు పెళ్ళి చేసిచూడు, ఇల్లుకట్టి చూడు అని అర్ధం అయ్యిందా" అన్నాడు నవ్వుతూ అనునయంగా . ఇది జరిగిపోయి రెండునెలలు అయిపోయినా ఎప్పుడైనా గుర్తొస్తే కొంచెం బాధగాఅనిపించి మట్లాడేటప్పుదు ఒకటికి రెండుసార్లు అలోచించుకోవలసిన అవసరాన్ని నాకు గుర్తుచేస్తూ ఉంటుంది.

0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి