శనివారం, ఏప్రిల్ 25, 2020

మన పక్కనే జరిగినా మనకి తెలియనిజలియన్‌వాలా బాగ్-విదురశ్వత్థ





జలియన్ వాలాబాగ్, భారత స్వతంత్ర పోరాట చరిత్రలో మర్చిపోలేని ఒక చేదు జ్ఞాపకం. పంజాబ్ రాష్ట్రంలో ఉన్న అమృత్సర్ పట్టణంలోని జలియన్ వాలాబాగ్ అనే తోటలో సమావేశమయ్యి, సభ నిర్వహించుకుంటున్న స్వాతంత్ర ఉద్యమకారులని చుట్టుముట్టి, ఏవిధమైన warning లేకుండా జనరల్ డయ్యర్ ఒక్కసారిగా firingచేసి అనేకమంది మరణానికి కారణమయ్యాడు. దాని గురించి మనలో చాలామందికి తెలుసు.
కానీ దక్షిణ భారతదేశంలో మన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా అదే తరహా సంఘటన జరిగిందని, దానికి ఇవాళ్టితో  82 సంవత్సరాలు నిండాయని మనలో చాలా మందికి తెలీదు. అలా మనెవ్వరికీ తెలియకుండ మరుగున పడిపోయిన దక్షిణ భారత జలియన్ వాలాబాగ్ దుర్ఘట్న గురించి ఇవాళ తెలిసుకుందాం. యాదృశ్చికంగా రెండు సంఘటనలూ ఏప్రెల్ నెలలోనే జరిగాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా సరిహద్దు రాష్ట్రం కర్ణాటక లో  ఒకప్పుడు గౌరీబిదనూరు జిల్లాలో  ఉన్న విదురశ్వత్థ అనే గ్రామంలో 1938 ఏప్రిల్ 25న ఈ విషాదం చోటుచేసుకుంది.  విదురశ్వత్థ పెన్నేరు నది ఒడ్డున ఉండే ఒక ప్రశాంతమైన గ్రామం. 

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఆసక్తికరంగా ఉందే. ఎప్పుడూ వినలేదు / చదవలేదు. అంతగా ఎలా మరుగున పడిపోయింది ఈ సంఘటన?

దీన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి దృష్టికి తీసుకువెడితే వారేమన్నా తగిన ప్రచారం కల్పిస్తారేమో? పాఠ్యపుస్తకాల్లో కూడా చేర్చవచ్చు.

Jai Gottimukkala చెప్పారు...

బ్రిటిష్ ఇండియాలో జరిగిన పోరాటాలకున్న ప్రాచుర్యం స్వదేశీ సంస్థానాలలోని బలిదానాలకు రాలేదు. ఇందుక్కారణం మాజీ సంస్థానాధీశులు & దేశముఖులు తదుపరి కాలంలో సైతం ఆధిపత్య వర్గాలలో కొనసాగడం కూడా కావచ్చును.

విదురశ్వత్థ గ్రామ విశిష్టత గురించి, అక్కడ జరిగిన దమనకాండ గురించి ముందు తెలియదు. పెళ్ళయాక అత్తింటి వైపు "అశ్వత్థనారాయణ" పేరు విన్నప్పుడు అశ్వథామ పేరు పెట్టుకున్నారేంటని ఆశ్చర్యపోయి వాకబు చేస్తే అసలు నిజాలు తెలిసినాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి